ఇంజినీరింగ్ పీజీ, పీహెచ్‌డీల్లోకి ప్రవేశం కల్పించే ‘గేట్’ నోటిఫికేషన్ విడుదలయింది. మరో పక్క ఎంబీఏ ప్రవేశపరీక్ష ‘క్యాట్’ ప్రకటన త్వరలో వెలువడబోతోంది. విద్యార్థుల భవితకు భిన్న కోణాల్లో ఉపయోగపడే కీలక పరీక్షలివి. వీటిలో దేన్ని ఎంచుకోవాలి? దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి? ఈ విషయంపై స్పష్టత లేక ఇంజినీరింగ్ విద్యార్థులు ఊగిసలాటతో ఉంటున్నారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ.. గేట్ ఆన్‌లైన్ పరీక్ష ముఖ్యాంశాలు, సన్నద్ధత వ్యూహం గురించి తెలుసుకుందాం!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) స్కోరు పీజీ ప్రవేశానికి మూడేళ్ళ పాటు చెల్లుబాటవుతుంది. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు 1 లేదా 2 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది. ఇక కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) స్కోరు ఏడాదిపాటే చెల్లుతుంది.
ఇంజినీరింగ్ తర్వాత ఎంటెక్ చేయకుండా ఎంబీఏ వైపే కొందరు మొగ్గు చూపుతుంటారు. తమ సాంకేతిక ప్రతిభకు మేనేజ్‌మెంట్ సామర్థ్యం తోడైతే తిరుగుండదని వారి విశ్వాసం. అయితే ఎంటెక్ గానీ ఎంబీఏ గానీ.. దేన్ని ఎంచుకోవటానికైనా ఇతర అంశాల కంటే విద్యార్థి తన అభిరుచికే ప్రాధాన్యం ఇవ్వటం సముచితం.
‘గేట్’ ద్వారా ఎంటెక్/ ఎం.ఇ.లో చేరే విద్యార్థులు సాంకేతిక రంగాలతో పాటు పరిశోధన, ఉత్పత్తి/ సేవలు, బోధన రంగం, అనుబంధ రంగాల్లో అభిరుచి ఉన్నదానిలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ‘క్యాట్’ ద్వారా ఎంబీఏ చదివేవారు సాంకేతికతతో నేరుగా సంబంధం ఉండని వ్యాపార సేవలు, ఆర్థికరంగ సేవలు, ఐటీ సేవలు, బీమా సేవలు, కన్సల్టెన్సీ సేవల్లో ఆసక్తి ఉన్న కెరియర్లను తీర్చిదిద్దుకోవచ్చు.
ఈ సందర్భంగా మరికొన్ని అంశాలనూ పరిగణించి నిర్ణయం తీసుకోవటం సమంజసం.
నాలుగు సంవత్సరాల ప్రతిభ: నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో విషయ పరిజ్ఞానాన్ని అలవరచుకొని అందులో ఆసక్తి ఉన్నవారు గేట్ ద్వారా మంచి అవకాశాలు పొందవచ్చు. కోర్ సబ్జెక్టుల్లో అంతగా ఆసక్తి లేకపోతే క్యాట్‌ను ఎంచుకోవడం ఉత్తమం.
విద్యార్థి ఆలోచన విధానం: ఇది విశ్లేషణాత్మకంగా ఉంటే గేట్‌ను ఎంచుకోవాలి. సృజనాత్మకంగా ఉంటే క్యాట్‌ను ఎంచుకోవడం మంచిది.
ఉద్యోగ అవకాశాలు: గేట్ ద్వారా ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేట్‌రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. క్యాట్ ద్వారా ప్రైవేటు రంగ సంస్థల్లో అవకాశాలు అధికం.
జీవిత ఆశయం: సొంతంగా ఏదైనా సంస్థను స్థాపించాలని భావించేవారు క్యాట్‌ను ఎంచుకోవాలి. పరిశోధన పరంగా ఏదైనా సంస్థకు తోడ్పడాలంటే గేట్ రాయవచ్చు.
వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు: ఈ అంశాలపై మంచి పరిజ్ఞానం ఉంటే క్యాట్ ఎంపిక మేలు. వాటిలో కొంచెం వెనకబడివుంటే గేట్ రాయడం మంచిది.
క్లుప్తంగా చెప్పాలంటే... కోర్ సబ్జెక్టులకు సంబంధించి భవితను మల్చుకోదల్చినవారికి గేట్ సరైన ఎంపిక. బిజినెస్ సంబంధిత జీవనంపై ఆసక్తి ఉన్నవారు క్యాట్ ద్వారా తమ లక్ష్యంవైపు పయనించవచ్చు!
వెయిటేజిని మరవకండి
గేట్‌లో మార్కుల పరంగా వెయిటేజి ఎక్కువ ఉన్న సబ్జెక్టులను/ అధ్యాయాలను మొదటగా సాధన చేసి పునశ్చరణ చేయాలి. సాధన సమయంలోనే ఆన్‌లైన్ టెస్ట్‌లపై దృష్టి సారించాలి. పరీక్ష సమయం దగ్గర పడేకొద్దీ తెలియనివి కొత్తగా ఏవీ చదవకూడదు. పరీక్ష సమయంలో ఏదైనా ప్రశ్నలకు సమాధానం రాకపోతే పదేపదే చేస్తూ సమయం వృథా చేసుకోకుండా తర్వాతి ప్రశ్నలకు వెళ్లాలి. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి తెలిసిన వాటికి మాత్రమే సమాధానం రాయాలి.
- వెంకట కృష్ణ, గేట్-2018 ఆలిండియా 24 ర్యాంకర్
|
గేట్ పరీక్షా విధానం
గేట్ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు, ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
గేట్ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు, ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం - 1 (జనరల్ ఆప్టిట్యూడ్): ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు, 6 నుంచి 10 ప్రశ్నలకు రెండు మార్కులుంటాయి. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్ సంబంధిత (వెర్బల్ ఎలిబిటీ). మిగతా ప్రశ్నాలు క్వాంటిటేటివ్ ప్రశ్నలు ఇవ్వవచ్చు.
విభాగం - 2 (సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టులు): ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్ మార్కులుంటాయి. న్యూమరికల్ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
వర్చువల్ క్యాలిక్యులేటర్: పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యులేటర్, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాలిక్యులేషన్ చేసుకోవడానికి ఆన్‌లైన్ వర్చువల్ క్యాలిక్యులేటర్‌ని అందుబాటులో ఉంచనున్నారు. కంప్యూటర్ మౌస్‌ని ఉపయోగించి దీన్ని వాడుకోవచ్చు. వర్చువల్ క్యాలిక్యులేటర్‌లో అన్ని రకాల ఫంక్షన్స్ లేకపోవడం వల్ల ఇమాజినరి ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవచ్చు.

ప్రిపరేషన్‌లో సాధారణంగా చేసే తప్పులు?
గేట్ సిలబస్ పరంగా ఏ అంశాల పై దృష్టి ఎక్కువపెట్టాలో కొందరు గుర్తించరు. మార్కులు ఎక్కువ వచ్చే సబ్జెక్టులపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చదివిన అంశాలను పునశ్చరణ చేయాలనే విషయాన్ని విస్మరిస్తారు. సాధన సమయంలో ఏదైనా విషయంలో మనస్తాపానికి గురై ప్రేరణ కోల్పోతారు. గత ప్రశ్నపత్రాలను, మాక్ టెస్ట్‌లను సాధన చేయరు. ఈ లోపాలు సవరించుకోవాలి. అనేక పాఠ్య పుస్తకాలను చదవటం కంటే ఒక ప్రామాణిక పాఠ్యపుస్తకాన్ని అనేకమార్లు సాధన చేయడం ఉత్తమం.
|
విజయం సాధించాలంటే
* ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల ప్రశ్న పత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్ని చదవాలి.
* గేట్- 2019కు 6 నెలల కాల వ్యవధి ఉంది. ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికలో రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల సమయం సాధనకు కేటాయించాలి.
* ప్రాథమికాంశాలపైన సరైన అవగాహన తెచ్చుకుని తర్వాత కఠినమైన ప్రశ్నలను సాధన చేస్తూ ప్రతి వారాంతం, నెలకొకసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి.
* తొలిసారి సిద్ధమయ్యేటప్పుడు ప్రతి చాప్టర్‌కి సంబంధించి ముఖ్య అంశాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి.
* చదివిన ప్రతి అంశాన్నీ పునశ్చరణ చేయాలి. ఇందుకోసం ముందుగా తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలు ఎంతగానో ఉపయోగపడతాయి.
* మంచి ప్రామాణిక పాఠ్య పుస్తకాలు ఎంచుకోవడం ప్రధానం.
* గేట్ గత ప్రశ్నపత్రాలను, ఆన్‌లైన్ మోడల్ పేపర్లను తప్పనిసరిగా సాధన చేయాలి.
* పరీక్షలో ప్రతి ప్రశ్నకి సమాధానం రాయడం కష్టం. 3 గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.

సమయపాలన ముఖ్యం..
గేట్ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్ ఆధారంగా ఏ అంశాల్లో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని దానికి అనుగుణంగా సాధన ప్రణాళికను రూపొందించుకోవాలి. అభ్యర్థులు తమ స్థాయిని బట్టి సొంతంగా ప్రిపేర్ కావాలా, కోచింగ్ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. గేట్ ప్రిపరేషన్‌లో సమయపాలన అత్యంత కీలకం. ఏ రోజు సాధన చేయాల్సిన అంశాలను అదే రోజు పూర్తి చేయాలి. దీని ద్వారా పునశ్చరణకి వీలైనంత సమయం దొరుకుతుంది. చదివిన అంశాలపై అవగాహన ఎంతో తెలుసుకోవడం కోసం మాక్ టెస్టులను అభ్యాసం చేయాలి. ప్రాథమిక అంశాల సాధన తర్వాత గత గేట్, ఐఈఎస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీని వల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగు తున్నారో అవగతం అవుతుంది.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2018 సెప్టెంబర్ 1
దరఖాస్తు సమర్పణ గడువు: 2018 సెప్టెంబర్ 21
గేట్ 2019 పరీక్ష తేదీలు: 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10
పరీక్ష ఫలితాల వెల్లడి: 2019 మార్చి 16
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 2018 సెప్టెంబర్ 1
దరఖాస్తు సమర్పణ గడువు: 2018 సెప్టెంబర్ 21
గేట్ 2019 పరీక్ష తేదీలు: 2019 ఫిబ్రవరి 2, 3, 9, 10
పరీక్ష ఫలితాల వెల్లడి: 2019 మార్చి 16
రిఫరెన్స్ పుస్తకాలు:
న్యూమరికల్ ఎబిలిటీ: ఆర్.ఎస్.అగర్వాల్
మ్యాథమేటిక్స్: ఎ.ఆర్.వశిష్ట, బి.ఎస్.గ్రేవాల్, హెచ్.కె.దాస్
ఇంగ్లిషు: రెన్ అండ్ మార్టిన్
పూర్వ గేట్ ప్రశ్నపత్రాలు, ఐఈఎస్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలు, ఇతర రాష్ట్రాల పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు.

లాంగ్ టర్మ్.. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్
లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది విద్యార్థులు ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో లేదా నాలుగో సంవత్సరంలో లేదా ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత మొదలుపెట్టవచ్చు.
* ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు కళాశాలలో జరిగే పాఠ్యాంశాలు, పరీక్షలు, ప్రాజెక్టు వర్క్‌లతో పాటు గేట్ ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాల్సి ఉంటుంది. వీరికి దాదాపుగా ఉదయం 3 గంటల సమయం, సాయంత్రం 3 గంటల సమయం దొరుకుతుంది. * కాబట్టి శిక్షణకు వెళ్లదలచినవారు ఉదయం గానీ సాయంత్రం గానీ ఎంచుకోవచ్చు. అయితే ఉదయం శిక్షణకు వెళ్లే విద్యార్థులు సాయంత్రం, సాయంత్రం శిక్షణకు వెళ్లే విద్యార్థులు ఉదయం తప్పనిసరిగా ప్రతిరోజూ తరగతి గదిలో చెప్పిన పాఠ్యాంశాల సాధన చేయాలి. * సాధారణంగా ప్రాజెక్టు వర్క్‌లు, అసైన్‌మెంట్లు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉంటాయి. కాబట్టి గేట్ ప్రిపరేషన్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో మొదలుపెడితే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు గేట్ రాయడానికి దాదాపుగా 8 నెలల సమయం దొరుకుతుంది. వీరు గేట్ సాధనకు రోజుకు 6 నుంచి 7 గంటలు కేటాయించాలి. * ఇక తక్కువ కాలంలో గేట్ ప్రిపేర్ అయ్యే (షార్ట్ టర్మ్) అభ్యర్థులు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల సమయం సాధనకు కేటాయించాలి. * అందుబాటులో నున్న తక్కువ సమయంలో ఏ అంశాలను చదివితే పరీక్షలో మంచి మార్కులు సాధించగలమో వాటిపై శ్రద్ధ పెట్టాలి. * 50 శాతం సమయం ప్రాథమికాంశాలకూ, 50 శాతం సమయం ప్రశ్నల సరళికి అనుగుణంగా ఉండే న్యూమరికల్ ప్రశ్నలకూ వెచ్చించాలి. * ఉన్న వ్యవధిలో ఏ ప్రశ్నలకు జవాబులు రాస్తే ఎక్కువ మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. పరీక్ష సన్నద్ధత సమయంలో కూడా ఇవే సూత్రాలు పాటించి, అలవాటు చేసుకోవాలి. |
గేట్ స్కోరు దేనికి?
ఆఖరి సంవత్సరం ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ చదివేవారూ, కోర్సు పూర్తయినవారూ గేట్ రాయటానికి అర్హులు.అలాగే బీఎస్; ఎంఎస్‌సీ/ఎంసీఏ చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, పూర్తయిన విద్యార్థులు కూడా రాయవచ్చు. కోర్సు డిగ్రీ సర్టిఫికెట్/ప్రొవిజినల్ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేయాలి. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది.
ప్రతిష్ఠాత్మక ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీ విభాగాల్లో ఉన్నత విద్యా ప్రవేశాలకు గేట్ స్కోరు తప్పనిసరి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖల తరపున ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, 7 ఐఐటీల (బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, మద్రాస్, రూర్కీ) సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ సారి గేట్‌ను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది.
* కొన్ని పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల గేట్‌కు ప్రాముఖ్యత కొనసాగుతోంది. అందులో కొన్ని సంస్థలు: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్, గెయిల్, హాల్, ఐఏసిఎల్, ఎన్‌టిపిసి, ఎన్‌పిసిఐఎల్, ఓఎన్‌జిసి, డీఆర్‌డీఓ లాంటి పరిశోధన సంస్థలు తమ సంస్థలలో ఉద్యోగ నియామకాలకు గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
* ఈ సంస్థల్లో నియమితులైన వారికి మంచి జీతభత్యాలతో పాటు ఉద్యోగ భద్రత ఉంటుంది.
* గేట్ - 2019 పరీక్షను మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. అవి- బంగ్లాదేశ్, ఇథియోపియా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశాల్లో పరీక్షను రాసే అభ్యర్థులు ఇంజినీరింగ్ బ్యాచ్‌లర్స్ డిగ్రీ లేదా సంబంధిత సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి అయి లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
* ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను 24 పేపర్లలో నిర్వహిస్తారు. (అభ్యర్థి ఏదో ఒక పేపర్ మాత్రమే ఎంచుకోవాలి). గేట్ 2019లో కొత్తగా స్టాటిస్టిక్స్ (ఎస్‌టీ) పేపర్‌ను చేర్చారు.
* ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటీలలో ఏదో ఒక జోనల్ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(GOAPS) ఉపయోగించి దరఖాస్తు ఆన్‌లైన్‌లో నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: gate.iitm.ac.in
ప్రత్యక్ష ఉపయోగాలు
* గేట్‌తో మన దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతో పాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం కూడా లభిస్తుంది. * గేట్ స్కోర్ పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నెలకు రూ.28,000 ఉపకార వేతనం లభిస్తుంది. * NITIE(Mumbai) లో పీజీ డిప్లమో (పీజీడిఐఈ, పీజీడీపీఎం, పీజీడీఎంఎం) ప్రవేశానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రాంగణ నియామకాల్లో సంవత్సరానికి రూ.15.82 లక్షలు జీతభత్యాలు లభ్యమవుతున్నాయి. * ప్రభుత్వ రంగ సంస్థలైన మహారత్న, నవరత్న, మినీరత్న హోదా కలిగిన సంస్థలతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా గేట్ స్కోరు ఆధారంగా తమ సంస్థల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. * గేట్ స్కోరు ఆధారంగా వివిధ ఐఐఎంలలో ఫెలో ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్లు కల్పిస్తున్నారు. * సింగపూర్‌లోని నాన్‌యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్), జర్మనీలోని ళిజూగిబీ తితిదిబీనివి, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్‌లు గేట్ స్కోరు ఆధారంగా ఎం.ఎస్, పీహెచ్‌డీ ప్రోగ్రాంలో చేర్చుకుంటున్నాయి.
పరోక్ష ఉపయోగాలు
* గేట్ ప్రిపరేషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ స్టేజ్ - 1 టెక్నికల్ పేపర్ ప్రిపరేషన్‌కు దృఢ[మైన పునాది. * ఇతర పోటీ పరీక్షల సన్నద్ధత సులభమవుతుంది. * క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో, ఇతర ప్రయివేట్ సంస్థల ఇంటర్వ్యూలకు గేట్ సన్నద్ధత ఉపయోగపడుతుంది. * గేట్‌లో ఉత్తీర్ణత... విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానానికి సూచికగా లెక్కిస్తారు. |
No comments:
Post a Comment